Site icon NTV Telugu

Music Director : రెమ్యునరేషన్లో దూసుకుపోతున్న నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్

Anirudh

Anirudh

Music Director : మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు. ప్రస్తుతం దేశంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. వరుసగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో అయితే స్టార్ హీరోలందరికీ అనిరుధ్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అతని మ్యూజిక్ ఉంటే సినిమాకి అదనపు అడ్వాంటేజ్ ఉంటుందని మేకర్స్ సైతం భావిస్తున్నారు. ఇక తెలుగులో కూడా అనిరుధ్ మెల్లగా మార్కెట్ పెంచుకుంటున్నాడు.

Read Also:Israel Hezbollah: యాహ్యా సిన్వర్‌ మృతి.. ఇజ్రాయెల్‌పై మండిపడిన హెజ్‌బొల్లా

ఇక్కడ కూడా తనకు అవకాశాలు పెరుగుతున్నాయి. రీసెంట్ గా ‘దేవర’ మూవీతో మ్యూజికల్ సక్సెస్ ని అందుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రెండు సినిమాలకి వర్క్ చేస్తున్నారు. అందులో ‘మ్యాజిక్’ అనే చిన్న సినిమా ఒకటి ఉంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండతో చేస్తోన్న ‘VD 12’ కూడా ఉంది. అలాగే నేచురల్ స్టార్ నానితో ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’, ‘జెర్సీ’ సినిమాలకి అనిరుధ్ వర్క్ చేశాడు. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. దీంతో పాటు ‘దేవర 2’ లైన్ లో ఉంది.

Read Also:Take Care Eyes: కంప్యూటర్‌, మొబైల్స్ వాడేవారు కళ్లు జాగ్రత్త.. లేదంటే..

అలాగే అజిత్ నటిస్తున్న ‘విడామయార్చి’, రజినీకాంత్ ‘కూలి’ ఉన్నాయి. హిందీలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాకి కూడా అనిరుధే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇలా పాన్ ఇండియా హీరోల సినిమాలకు ఆయన పని చేస్తుండడంతో రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కోసం రూ.12 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడంట. మినిమమ్ బడ్జెట్ మూవీస్ కోసం 10 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

Exit mobile version