‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన జ్యోతిరాయ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ లో పద్దతిగా ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్‌తో సెగలు రేపుతూ ఉంటుంది. అయితే ఆమె తాజాగా తన భర్త, దర్శకుడు సుక్కూ పూర్వాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్ (పార్ట్ 1- డ్రీమ్ గర్ల్)” లో నటించగా.. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా గురించి షాకింగ్ విషయం ఒకటి వైరల్ అవుతుంది. ప్రమోషన్స్ ఎడిటింగ్ విషయంలో అనిల్ రావిపూడి తనవంతు సాయం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్యోతిరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనిల్ రావిపూడితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ..
Also Read : Mega #158 : బాబీ – చిరు మూవీలో మెగాస్టార్‌కు జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ బ్యూటీ!
“హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారు, సుక్కూ పూర్వాజ్‌లు మంచి స్నేహితులు. ఆయన మా ఎడిటింగ్ సూట్‌ను సందర్శించి, సినిమాను పరిశీలించారు” అని రాసుకొచ్చారు. అనిల్ రావిపూడికి మాస్ పల్స్ బాగా తెలుసు కాబట్టి, తన ఫ్రెండ్ సుక్కూ కోసం ఈ సినిమా కథలో కానీ, ప్రమోషన్ స్ట్రాటజీలో కానీ కొన్ని కీలక మార్పులు సూచించినట్లు సమాచారం. సీరియల్స్‌లో పద్ధతిగా కనిపించిన జ్యోతిరాయ్, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని బోల్డ్ అండ్ యాక్షన్ రోల్‌లో కనిపిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అనిల్ రావిపూడి సపోర్ట్‌తో ‘కిల్లర్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
