వరుస విజయాలతో టాలీవుడ్‌లో హిస్ట్రీ క్రియేట్ చేస్తున్నాడు పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపిస్తూ ఆయన చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడికి ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెడుతున్నారు. అదేంటి అంటే..
Also Read : Anaganaga Oka Raju: ప్రేక్షకులే నా బ్యాక్ గ్రౌండ్- వీన్ పొలిశెట్టి!
కింగ్ నాగార్జునతో కూడా ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేయమని కోరుతున్నారు. నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన ‘హలో బ్రదర్’ తరహాలో, నాగ్ స్టైల్ అండ్ స్వాగ్‌కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిజానికి అనిల్ రావిపూడి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జునను డైరెక్ట్ చేయాలని చాలా కాలంగా కోరిక ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన చేతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ తో పాటు, బాలయ్యతో మరో సినిమా లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో అనిల్-నాగ్ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ప్రేక్షకులకు అది అసలైన ‘కమర్షియల్ ట్రీట్’ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.
