మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం ఛాన్స్ ఇచ్చారు.. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము జీరోలుగా ఉన్నాం.. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ లీడర్లను, మంత్రులను చేశారు.. మన తరాలు, తలరాతలు మారాలనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Parks Close: పోలింగ్.. హైదరాబాద్ పార్కులు బంద్
ఇక, చంద్రబాబు గతంలో ఎంత మందికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాడంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఓ పది వేల మందికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలతో మసిపూసి మారేడు కాయ చేశాడంటూ విమర్శలు గుప్పించారు. నేను మీకు మంచి చేస్తేనే ఓట వేయ్యండని ధైర్యంగా జగనన్న చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ముంచేందుకు మళ్లీ తండ్రీ కొడుకులు సిద్ధమవుతున్నారు.. చంద్రబాబు మత్స్యకారుడిని తోలుతీస్తాననంటూ తిట్టాడు.. కానీ, జగన్ మాత్రం మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించాడని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
Read Also: Dharmana Prasada Rao: ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుంది..
రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. విశాఖలో బోట్లు తగలబడితే కేవలం నాలుగు రోజుల్లో వారికి సాయం అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.. 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ ను గెలిపించుకుందామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. మచిలీపట్నం నుంచి 2024లో పేర్ని కిట్టుని గెలిపించుకోవాలి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క బీసీ మంత్రి కూడా రాలేడు.. కానీ జగన్ సీఎం అయ్యాకా.. బీసీనైన నన్ను మంత్రిని చేశారని అనిల్ కుమార్ యదవ్ వెల్లడించారు.