Anil Kumar Yadav: పవన్ కనీసం 15 శాతం సీట్లు తీసుకోలేకపోయారు.. 4 స్థానాల్లో కూడా గెలవడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Kumar Yadav: టీడీపీ-జనసేన విడుదల చేసిన తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సెటైర్లు వేస్తున్నారు.. రానున్న ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలకు పైగా గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇక, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో 8 కోట్ల రూపాయల నిధులతో నిర్మితమవుతున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి, సీతానగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌పై హాట్ కామెంట్లు చేశారు. పవన్ కల్యాణ్ కనీసం 15 శాతం సీట్లు తీసుకోలేకపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. 24 సీట్లలో జనసేన కనీసం నాలుగు కూడా గెలవదు అని జోస్యం చెప్పారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక పక్క ఉంటే మరో పక్క టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిల ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు అనిల్ కుమార్.. జనసైనికులను చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టాడు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్.. ఎనలేని కృషి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి చెందగానే.. ఈ ఓటమికి పొత్తు, పవన్ కల్యాణే కారణమని చంద్రబాబు తప్పుకుంటాడు అంటూ సెటైర్లు వేశారు. రాజనగరంలో జనసేన అభ్యర్థి ప్రకటనతో జక్కంపూడి రాజా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..