Anganwadi Strike: అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. జీతాలు పెంచాలని అంగన్వాడీ సంఘాలు పట్టుబట్టాయి. ఇప్పటికిప్పుడు పెంచలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు. నోటీసులు, ఎస్మా వంటి తాటాకు చప్పుళ్ళకు మేం భయపడమన్నారు. రేపటి నుంచి కోటి సంతకాల సేకరణ చేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు వెల్లడించారు. మాకు ఇచ్చే నోటీసులను భోగి మంటల్లో కాలుస్తామన్నారు.
Read Also: Andhrapradesh: అంగన్వాడీ సంఘాలతో కొలిక్కిరాని ప్రభుత్వ చర్చలు
పండుగ లోపు మా జీతాలు పెంచకపోతే నిరవధిక నిరహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని.. మహిళలు అంటే గౌరవం లేదని తీవ్రంగా మండిపడ్డారు. పని భారం పెరిగి మాకు బీపీలు, షుగర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నకు చెబుదాం అని కోటి సంతకాలు సేకరిస్తామన్నారు. ముఖ్యమంత్రిని కలుస్తాం అంటే అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని వారు అంగన్వాడీ ప్రతినిధులు మండిపడ్డారు.
