NTV Telugu Site icon

AP Assembly: గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు

Ap Assembly

Ap Assembly

AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. నేడు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్‌ను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం .. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సాగనుండగా.. చర్చ అనంతరం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పనున్నారు. ఇక, సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లరక్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024 అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది వైఎస్‌ జగన్‌ సర్కార్. ఇక, ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.. శాసన మండలిలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. తీర్మానంపై చర్చ సాగనుంది.

Read Also: VellamPalli Srinivas vs Bonda Uma: వెల్లంపల్లి వర్సెస్‌ బోండా ఉమా.. సీరియస్ కామెంట్స్..!

కాగా, తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని సభ ముందు పెట్టారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టినట్టు.. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నాం. మనబడి నాడు-నేడు ద్వారా స్కూల్స్‌ రూపురేఖలు మార్చాం. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని అ‍మ్మఒడి పథకం తెచ్చాం. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలే లక్ష్యంగా నాడు-నేడు కార్యక్రమం చేపట్టాం.. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా రూ.15వేలు జమ చేస్తున్నాం అన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 10,132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం.. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు. 53 ఏరియా ఆసుపత్రులు, తొమ్మిది జిల్లా ఆసుపత్రుల్లో వసతులు అభివృద్ది చేశామని తెలిపారు. రైతులు రాష్ట్రానికి వెన్నముక తమ ప్రభుత్వం నిలబడింది.. 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చామని.. రైతు భరోసా కింద రూ.33,300 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.