Andhrapradesh: ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయమే వీఆర్‌ఎస్‌కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్‌ఎస్‌కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేయనున్నట్లు సమాచారం. సీనియర్ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సమాచారం. తన సర్వీసులకు రాజీనామా చేసి మరీ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
Read Also: TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ప్రారంభం
గతంలో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది. ఆయన సొంత జిల్లా కర్నూలు. తన సర్వీసులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ.. ఇంతియాజ్ అహ్మద్‌ను బరిలోకి దించుతుందని అంటున్నారు. మైనారిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల పార్టీకి లాభిస్తుందని అంచనా వేస్తోంది.