NTV Telugu Site icon

Pawan Kalyan: మిస్సైన యువతిని ఇంటికి రప్పించిన డిప్యూటీ సీఎం

Maxresdefault (1)

Maxresdefault (1)

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా అయిన భీమవరంలో తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి ఏపీ పోలీసులు రుజువుచేశారాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యణ్ వారిని అభినందించారు. ఇక వివరాలలోకి వెళ్లినట్టు అయితే భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. గతంలో చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ, మీరే ఎలాగైనా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట గుండెలవిసేలా విలపించారు. ఆ తల్లి బాదకు చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాచవరం సీఐతోనూ, విజయవాడ పోలీస్ కమిషనర్‎తోనూ ఫోన్లో మాట్లాడారు. కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన ఏపీ పోలీసులు ఆ యువతి ఆచూకిని కునుగొనేందుకు విశ్వా ప్రయత్నాలు చేసారు. చివరకు జమ్మూలో ఉన్నట్లు ఆమె జాడను పోలీసులు కనిపెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం జమ్ము వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతం అయ్యింది.

Also Read: Pawan Kalyan: ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్.. మత్స్యకారుల ఇబ్బందులపై ఆరా

బాలికను తీసుకువస్తున్న విషయాన్ని ముందుగా విజయవాడ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‎కు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‎లో అధికారులతో సమీక్షలో ఉండగా తెలిపారు. సమీక్ష మధ్యలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి ఆచూకీ కనుగొన్న పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేశారు. ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ద చేయవద్దని ఈ సందర్భంగా కోరారు. ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయాలన్నారు. వాటిపై పోలీసులు తక్షణం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మరోసారి పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ కూతురు ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఈ రోజు ఆ అమ్మాయిని తన తల్లి తండ్రులకి అప్పగించనున్నారు. గతంలో అనేక సభల్లో ఏపీలో 35వేల మందికిపైగా యువతులు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకు ఈ కేసు బలం చేకూర్చినట్లయిందని అంటున్నారు జనసేన పార్టీ నేతలు. గతంలో ఎన్నిసార్లు ఈ అంశంపై ప్రసంగించినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.