Site icon NTV Telugu

Daggubati Purandeswari: అధికార పార్టీపై పురందేశ్వరి ఫైర్.. అప్పుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్

Purandeswari On Ap

Purandeswari On Ap

BJP Chief Daggubati Purandeswari demands White Paper On Debts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి అధికార వైఎస్సార్ సీపీపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ ఆమె ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో వైయస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల గురించి ప్రశ్నించారు. దీనికి నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే నిన్న పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గూర్చి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలియచేసిన విషయాలు పై పురందేశ్వరి పూర్తి వివరణ ఎక్స్( ట్విటర్) వేదికగా ఇచ్చారు.

Also Read: Burning Man Festival: అయ్యో పాపం.. పండుగకొచ్చి ఇరుక్కుపోయారో.. బురదలో 70 వేల మంది

ఆంధ్రప్రదేశ్ అప్పుడు రూ. 4 లక్షల కోట్ల పై చిలుకు ఉన్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారని చెప్పిన పురందేశ్వరి అవి కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గణాంకాలు మాత్రమే అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అప్పు రూ.10 లక్షల కోట్ల వరకు ఉందని, గతంతలో తాను ఈ విషయాన్ని చెప్పానని మళ్లీ చెబుతున్నానన్నారు. రిజర్వ్ బ్యాంక్ కు అధిక జీడీపీని చూపి ఎక్కువ అప్పును తెచ్చకున్నట్లు పురందేశ్వరి ఆరోపించారు. స్థూల ఉత్పత్తిని రూ.15 లక్షల చూపించి అప్పు తెచ్చిందని పేర్కొన్న పురందేశ్వరి లిక్కర్ మీద వచ్చిన డబ్బును చూపించి ఆదాయం పెరిగిందని చెప్పడం సమంజసం కాదన్నారు.

చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బలు చెల్లించలేదని ఆరోపించిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో దిక్కార కేసులను ఎదుర్కొంటుందిని వెల్లడించారు. పరిశ్రమలు రాకుండా ఆదాయం ఎలా పెరిగిందని చూపెడతారంటూ పురందేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటన్నింటి పై ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఇన్ని అప్పులు పెట్టుకొని దీనిని సుపరిపాలన అని ఎలా అంటారని ప్రశ్నించిన ఆమె ఇవి తరువాత వచ్చే ప్రభుత్వాలపై భారంగా మారతాయన్నారు.

ఏపీలో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయని, పెట్రోలియంపై కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్ను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎందుకు ఊరట కలిగించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీపై రూ.200, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లపై రూ.400 తగ్గించిందని వివరించారు. ప్రజలపై అన్ని పన్నులు వేస్తున్నా రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి కన్పించడం లేదని నిలదీశారు పురందేశ్వరి. ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించిన ఆమె ప్రజలకు వీటన్నింటి గురించి వివరించేలా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

 

 

 

Exit mobile version