Train Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 9 మంది మరణించారు. మూడు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రులలో చేరారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. రైల్వేశాఖ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశంలో తరచూ ఇలాంటి రైలు ప్రమాదాలు జరగడం చాలా ఆందోళనకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో హౌరా-చెన్నై లైన్‌లో రైలు సిగ్నల్‌ను దాటి మరొక రైలును ఢీకొనడంతో అనేక కోచ్‌లు పట్టాలు తప్పాయి. 08532 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు, 08504 విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ ఢీకొనడంతో సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు వెనుక నుంచి రెండు కోచ్‌లు, సిగ్నల్‌కు ముందు వెళ్లిన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. దీనిపై విచారణ జరుగుతోంది.
మరోవైపు ఈ రైలు ప్రమాదం తర్వాత, మమతా బెనర్జీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. రైళ్లు ఢీకొనడం, కోచ్‌లు పట్టాలు తప్పడం, కోచ్‌లలో చిక్కుకున్న నిస్సహాయ ప్రయాణికులు ఇలా పదే పదే జరుగుతూనే ఉంది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపాలని, సత్వర సహాయక చర్యలు చేపట్టాలి. తక్షణ దర్యాప్తు కోరారు. రైల్వేశాఖ నిద్రమత్తు నుండి ఎప్పుడు బయటపడుతుంది అంటూ ప్రశ్నించారు.
Read Also:Kuldeep Yadav Ball: కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ బాల్.. బిత్తరపోయిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్
Another disastrous rail collision, this time in Vizianagaram district in Andhra Pradesh, involving two passenger trains, and causing uptil now at least 8 deaths and injury of at least 25 more.
Frontal collisions between trains, derailment of compartments, helpless passengers…
— Mamata Banerjee (@MamataOfficial) October 29, 2023
ఈ రైలు ప్రమాదం చాలా బాధాకరం: కేజ్రీవాల్
‘ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ రైలు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో రాశారు. దేశంలో ఇలాంటి రైలు ప్రమాదాలు పదేపదే జరగడం చాలా ఆందోళన కలిగిస్తోంది.
आंध्र प्रदेश में हुई ये ट्रेन दुर्घटना बेहद दुखद है। इस हादसे में जिन परिवारों ने अपनों को खो दिया उनके साथ मेरी संवेदनाएँ। ईश्वर से प्रार्थना करता हूँ कि जो लोग घायल हुए हैं वो जल्द स्वस्थ होकर अपने घर लौटें।
देश में बार-बार इस तरह की ट्रेन दुर्घटनाओं का होना बेहद चिंताजनक है। https://t.co/DoGlttWFIg
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 29, 2023
Read Also:Punjab : డీజీపీ పదవి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు ఐపీఎస్‌లు.. నేడు విచారణ
రైలు భద్రతా చర్యలను కేంద్రం, రైల్వే వెంటనే పునఃపరిశీలించాలి : ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, “జూన్ 2023లో బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది నెలలకే, ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరంలో జరిగిన రైలు ఢీకొనడం వల్ల నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను, నా ఆలోచనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. ” అన్నారు.
Deeply distressed by the train collision in Vizianagaram, Andhra Pradesh, coming just months after the tragic Balasore #TrainAccident in June 2023.
My heart goes out to the families of the victims, and I wish a speedy recovery for the injured.
With a significant number of…
— M.K.Stalin (@mkstalin) October 29, 2023