NTV Telugu Site icon

Eggs Production: కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్‌ వన్‌

Egg Production

Egg Production

Eggs Production: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శుభవార్త.. కోడిగుడ్ల ఉత్పిత్తిలో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచినట్లు తాజాగా విడుదలైన కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే 2022 వెల్లడించింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంటే.. మనదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిన విషయాన్ని తాజాగా విడుదల చేసిన సర్వేలో పేర్కొన్నారు. కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్‌–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది.

1950-51 లో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది. కానీ.. అందుకు 5 రెట్లు ఎక్కువగా ఏపీ ఉండటం గమనార్హం.

Read Also: Minister KTR: అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో తెలంగాణదే మొదటి స్థానం

కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్.. ఐదో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలో పెరటి కోళ్ల ఉత్పత్తి గడిచిన రెండేళ్లలో పెరిగినట్లుగా పేర్కొన్నారు. 2020-21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70, 740 ఉండగా.. 2021-22లో 1,31,69,200కు పెరిగినట్లుగా సర్వే వెల్లడించింది. కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే పేర్కొంది.

Show comments