Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాలు, ఎగువ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీని ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుపై తీవ్రంగా పడింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే… నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన భారీ ఐరన్ తూరలు, ఐరన్ పైపులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే స్పిల్ ఛానల్ కింద నిర్మాణ పనుల అవసరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా స్పిల్‌వేపై ఉన్న ప్రధాన రహదారి ద్వారానే నిర్మాణ సామగ్రి రవాణా, సిబ్బంది రాకపోకలు కొనసాగుతున్నాయి.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
డేంజర్ మార్క్ దిశగా నీటిమట్టం..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… ప్రస్తుతం పోలవరం స్పిల్‌వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు చేరుకుంది. అలాగే ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 26.80 మీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో, రానున్న 24 గంటల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం (CWA), స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రాజెక్టు రక్షణకు మరియు సిబ్బంది భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!