Amaravati Assigned Lands Case: అమరావతి భూములపై సీఐడీ కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ కేసులపై తీర్పు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసైన్డ్ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం విదితమే కాగా.. సీఐడీ కేసులపై గతంలోనే స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు.. తుది విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది..
కాగా, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టులో తుది విచారణ సందర్భంగా గతంలో కీలక వాదనలు జరిగాయి.. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది. వీటికి రక్షణ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం లేకుండా జీవో 41 తీసుకువచ్చారని కోర్టులో వాదనలు వినిపించింది. ఎస్సీల నుంచి భూములు బినామీలు కొని వారే హక్కుదారుగా చూపించాలనే కుట్రతో జీవో 41 తీసుకొచ్చారని సీఐడీ తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలు అని, వారి స్టేట్మెంట్ను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేసింది. ఈ కేసులో బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో 18 కోట్లు ఉంటే ఇప్పుడు అది 600 కోట్ల రూపాయలుగా ఉందని సీఐడీ.. గతంలోనే కోర్టు దృష్టికి తీసుకెళ్లిన విషయం విదితమే.
Also Read
- గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
- FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
మరోవైపు.. చంద్రబాబు అండగా ఉన్నారనే మంత్రిగా నారాయణ ఈ బినామీ లావాదేవీలు నిర్వహించారని కూడా గతంతో కోర్టుకు విన్నవించింది సీఐడీ.. ఆరోపించింది. సీఐడీ సీజ్ చేసిన ఫోన్స్‌లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర మాట్లాడుకున్న కాల్ రికార్డ్ గుర్తించినట్టు సీఐడీ చెప్పింది. నారాయణ, ఆయన కుమార్తె సంభాషణ కాల్ రికార్డ్‌ను పెన్ డ్రైవ్‌లో వేసి న్యాయమూర్తికి అందజేసింది. అసైన్డ్ భూముల విషయంలో అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతి లాల్ దిండే, జేసీ చెరుకూరి శ్రీధర్ ఇబ్బందులు వస్తాయని చెప్పినా మంత్రి నారాయణ పట్టించుకోలేదని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఎఫ్ఐఆర్ల మీద స్టే ఉంటే ఏ విధంగా విచారణ చేశారని పిటిషనర్ ప్రశ్నించగా.. అసైన్డ్ భూములకు సంబంధించి దాఖలైన వేరే కేసుల్లో సీఐడీ విచారణ చేయగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ చెప్పింది. అయితే, తుది విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!