Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Andhra Pradesh Heatwave Temperatures Cross 45c Red Alert Issued

AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

Published Date :April 23, 2026 , 6:57 pm
By Sudhakar Ravula
AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేస్తూ, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. నేడు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 382 మండలాల్లో 40 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండ, ఉక్కపోత, వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రేపటికి వడగాలుల హెచ్చరిక
రేపు అనగా శుక్రవారం రోజు రాష్ట్రంలోని 62 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 89 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ఎల్లుండి 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 31 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

Also Read

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

ప్రధాన జిల్లాలకు రెడ్ అలర్ట్
శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం జిల్లాలో అత్యధిక మండలాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తృతంగా వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 45.1 డిగ్రీలు, సాలూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీలు, రాజాంలో 44.5 డిగ్రీలు, కరపలో 44.4 డిగ్రీలు, కంభంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రజలకు సూచనలు
అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండటం, తరచూ నీరు తాగడం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh heatwave
  • Andhra Pradesh temperature 45 degrees
  • Andhra weather news
  • AP latest weather updates
  • AP red alert

తాజావార్తలు

  • AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..

  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!

  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..

  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions