Anganwadi Strike: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో 26 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. అయితే, అంగన్వాడీలపై సీరియస్ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 తీసుకొచ్చింది.. ఇక, ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.. ఇదే సమయంలో సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత పెట్టింది.. అంగన్వాడీ వర్కర్లకు గత నెల వేతనం రూ.8,050 జమచేసింది ప్రభుత్వం.. వేతనంలో సుమారు రూ.3 వేలు కోత విధించిన తర్వాత మిగతా సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసింది.. గత కొద్ది రోజులుగా అంగన్వాడీలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం.. పలు డిమాండ్ల పై సానుకూలంగా స్పందించింది.. అయితే, జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ సమ్మె కొనసాగిస్తుస్తూ వచ్చారు అంగన్వాడీలు.. ఈ నేపథ్యంలో ఎలాగైనా వారిని కట్టడి చేయాలన్న ఉద్దశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, వైఎస్ జగన్ సర్కార్‌పై అంగన్వాడీలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also: Purandeswari: ఎస్సీలకు సంబంధించి 27 కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది..
