Liquor Price Hiked: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి మద్యం ధరలు పెరిగిపోయాయి.. క్వార్టర్ సీసాపై ఏకంగా ఒకేసారి రూ.10 వడ్డించారు.. ఫారిన్ లిక్కర్ పై కూడా వడ్డించింది ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ధరలు, మద్యం బ్రాండ్లపై ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు ఉన్నాయని మందు బాబులతో పాటు విపక్షాలు కూడా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిన్న పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరోసారి లిక్కర్ ప్రైజ్ పెంచేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది..
Read Also: IND vs AUS World Cup Final: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోడీ
పన్నుల సవరణ పేరిట పెంచిన తాజా ధరలతో క్వార్టర్ సీసాపై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.20 వరకు ధరలు పెరిగిపోయాయి.. మద్యంపై విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్ శాఖ.. ప్రస్తుతం ఏఆర్‌ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చాల్సిన అవసరం ఉందంటూ ఏపీఎస్‌డీసీఎల్ ప్రతిపాదనలు పంపగా.. వాటికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.. దీంతో.. సవరణలు చేస్తూ ఏపీ ఎస్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఐఎంఎఫ్‌ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్ శాఖ.. ఈ సవరణ ఫలితంగా మరోసారి మద్యం ధరలు పెరిగాయి.. ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి చేరింది.. అదే క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి పెరిగింది.. అయితే, ఈ పెరుగుదల కొన్ని బ్రాండ్లకు పరిమితం అయ్యింది.. ఈ సవరణ తర్వాత కొన్ని రకాల బ్రాండ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు.. ఫారిన్ లిక్కర్ సరఫరాదారులకు ఇచ్చే ధరను పెంచింది ఎక్సైజ్ శాఖ.. చాలాకాలంగా ఫారిన్ లిక్కర్‌పై ధరలు సవరించలేదని, పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని.. సరఫరాదారులకు ఇచ్చే ధరను 20 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏఈ ఎక్సైజ్ శాఖ.