NTV Telugu Site icon

AP Intermediate Topper: బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇంటర్మీడియట్ టాపర్గా నిలిచింది..

Karnool

Karnool

కర్నూల్ జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామానికి చెందిన నిర్మల చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేది. చదువంతా ప్రభుత్వ విద్యాయాల్లోనే కొనసాగించింది. అయితే, ఎంతో పట్టుదలతో చదువుతున్న ఆమె ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాపర్ గా నిలిచింది. ఆలూరు కేజీబీవీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న నిర్మల అత్యధిక మార్కులు తెచ్చుకుంది. బైపీసీలో మొత్తం 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. దీంతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నిర్మలకు అభినందనలు తెలియజేశారు. కాగా, నిర్మలది నిరుపేద కుటుంబం.. నలుగురు అక్కాచెల్లెల్లలో ఆమె చివరిది. ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు, నిర్మలకు కూడా పెళ్లి చేయాలని అనుకున్నారు.

Read Also: BJP Manifesto: రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల.. అందరిలో ఆసక్తి..

అయితే, నిర్మలకు మాత్రం పెద్ద చదువులు చదవాలని అనుకునేది. దీంతో గతేడాది ఎంతో కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షలో 600 మార్కులకు గాను 537 మార్కులు సాధించింది. దీంతో ఆమెను స్కూల్ టీచర్స్, తోటి విద్యార్థులు అభినందించారు. కానీ, తల్లిదండ్రులకు మాత్రం ఆమె సాధించిన మార్కులను పట్టించుకోకుండా.. ఈ మార్కులు తమ బిడ్డ పెళ్లికి అడ్డంకిగా మారతాయి అనుకున్నారు. కానీ, పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన నిర్మలను ఇంటర్మీడియట్ చదివించేందుకు తల్లిదండ్రులు ఒప్పకోలేదు. తాము చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశారు. పెళ్లి వయసు కాకున్నా ఆమెను బాల్య వివాహం చేసేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు.

Read Also: Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..

కానీ, చదువుకోవాలన్న నిర్మల ధైర్యంగా తన బాల్యవివాహం గురించి స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఇక, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు. దీంతో వారిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పడంతో నిర్మల తల్లిదండ్రులకు కలెక్టర్ నచ్చజెప్పడంతో వారు చివరికి ఒప్పుకున్నారు. దీంతో ఆలూరులోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీలో నిర్మల చేరింది. అయితే, కష్టపడి చదివిన నిర్మల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసింది.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మంచి మార్కులు సాధించి సెకండ్ ఇయర్ లోకి అడుగుపెడుతుంది. ఇక, నిర్మల మాట్లాడుతూ.. బాగా చదివి ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. తనలాగ ఎందరో అమ్మాయిలు తల్లిదండ్రుల ఆర్థిక కష్టాల కారణంగా చదువుకోలేకపోతున్నారు.. దీంతో వారు చిన్న వయసులోనే పెళ్లిల్లు చేసుకోవాల్సి వస్తోంది అని చెప్పింది. కాబట్టి పోలీస్ ఆఫీసర్ అయి.. బాల్య వివాహాలను అరికడతాను.. అమ్మాయిలు తమ కలలు నిజం చేసుకునేందుకు సహకరిస్తానని నిర్మల వెల్లడించింది.