Andhra Pradesh: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సర్కార్ ఫోకస్.. నేడు ప్రారంభించనున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే టార్గెట్‌గా పెట్టుకున్న సర్కార్.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. దానిలో భాగంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ రోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.. ఆరు యూనిట్లను ప్రారంభించడంతో పాటు.. మరో ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు ఏపీ సీఎం. ఈ రోజు ప్రారంభంకానున్న ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు కాగా.. ఒక మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, మరొకటి ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమ ఉన్నాయి.
Read Also: Zomato Delivery BOy: డెలివరీ బాయ్‌గా కష్టపడ్డాడు.. సర్వీస్ కమీషన్ జాబ్ కొట్టాడు.
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఈ రోజు 6 యూనిట్లకు ప్రారంభోత్సవం.. ఐదు యూనిట్లకు భూమిపూజ జరగనుండగా.. మొత్తం 11 యూనిట్లకు రూ.1,719 కోట్లు ఖర్చు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం జగన్.. రూ.63.15 కోట్లతో నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, రూ.5.37 కోట్లతో నిర్మించిన 43 కోల్డ్ రూమ్స్ ను కూడా ప్రారంభించబోతున్నారు.. అయితే, ఆపరేషన్ గ్రీన్స్ కింద ఒక్కొక్కటి రూ.5.5 కోట్లతో నిర్మించారు.. ఈ యూనిట్లు.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం తుమ్మగుంటపల్లి, చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి, సోమల మండలం కామిరెడ్డివారిపల్లెల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం ఏడాదికి 3,600 టన్నులు. ఒక్కో యూనిట్లో 15 మంది చొప్పున నాలుగు యూనిట్ల ద్వారా 60 మందికి ఉపాధికి లభిస్తుంది. 2,414 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు.. ఇక, విజయనగరంలో రూ.4 కోట్లతో ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, కర్నూలు జిల్లాలో ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఒక్కో యూనిట్ రూ.లక్ష చొప్పున రూ.కోటితో 100 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటు చేశారు. మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేయనున్నారు.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!