R5 Zone: ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R5 Zone: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. కృష్ణాయపాలెం చేరుకున్న తర్వాత కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్‌ను ఆవిష్కరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.. ఇక, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఏపీ సీఎం.. శంకుస్థాపన చేసిన అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మోడల్ హౌజ్‌ను పరిశీలించారు.. కాగా, కృష్ణాయపాలెం లేఅవుట్లో 50,793 ఇళ్ల నిర్మాణాలకు పూనుకుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఈ ఇళ్ల నిర్మాణానికి రూ.1,829.57 కోట్లు వెచ్చించనుంది. ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో వ్యయంతో అన్ని మౌలిక వసతులతో 50,793 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.. సీఆర్డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్లో ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
Read Also: KTR Birthday: నేడే కేటీఆర్ పుట్టినరోజు.. అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో బర్త్ డే విషెస్
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
ఇక, సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెసిందే.. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా అందజేశారు.. ఇక, ఆయా లేఅవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. మరోవైపు.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో 28,000 మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!