CM Chandrababu: రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!
- క్షేత్రస్థాయిలో పర్యటనలపై సీఎం చంద్రబాబు ఫోకస్
- అమరావతి రాజధాని ప్రాంతంలో నేడు సీఎం పర్యటన
- వైఎస్ జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ప్రారంభించనున్న సీఎం
- ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా సందర్శించనున్న ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇప్పుడు అమరావతి రాజధానిపై ఫోకస్ పెట్టనున్నారు.. అందులో భాగంగా ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. మొత్తంగా తన రెండో క్షేత్ర స్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టబోతున్నారు.. వైఎస్ జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ప్రారంభించనున్నారు సీఎం.. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి. ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు.. సిడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను పరిశీలించబోతున్నారు.
Read Also: USA vs SA: అమెరికాపై అతి కష్టంగా గెలిచిన దక్షిణాఫ్రికా!
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇక, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్లను పరిశీలించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన గత ప్రభుత్వం.. భవనాలను పట్టించుకోలేదు.. 70, 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం నాటి వైసీపీ ప్రభుత్వం వదిలేసిందనే విమర్శలు ఉన్నాయి.. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటి వైసీపీ సర్కార్ ఆయన్ని అడ్డుకుంది.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కూటమి అందుకుంది.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు.. దీంతో.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!