AP Cabinet: ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.
- ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల
- 24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు
- జనసేనకు 3
- బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులను కేటాయించారు. ఎస్సీలకు 2 మంత్రిపదవులు కేటాయించగా.. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రిపదవిని కేటాయించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది.
మంత్రులు జాబితా ఇదే..
1. నారా చంద్రబాబు నాయుడు
2. నారా లోకేష్,
3. కొణిదెల పవన్ కళ్యాణ్
4. కింజరాపు అచ్చెన్నాయుడు
5. కొల్లు రవీంద్ర
6. నాదెండ్ల మనోహర్
7. నారాయణ
8. వంగలపూడి అనిత
9. సత్యకుమార్ యాదవ్
10. నిమ్మల రామానాయుడు
11. ఎన్.ఎమ్.డి.ఫరూక్
12. ఆనం రామనారాయణరెడ్డి
13. పయ్యావుల కేశవ్
14. అనగాని సత్యప్రసాద్
15. కొలుసు పార్థసారధి
16. డోలా బాలవీరాంజనేయస్వామి
17. గొట్టిపాటి రవి
18. కందుల దుర్గేష్
19. గుమ్మడి సంధ్యారాణి
20. బీసీ జనార్థన్ రెడ్డి,
21. టీజీ భరత్,
22. ఎస్.సవిత
23. వాసంశెట్టి సుభాష్
24. కొండపల్లి శ్రీనివాస్
25. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!