Site icon NTV Telugu

AP Assembly Budget Session: నేటితో ముగియన్న అసెంబ్లీ సమావేశాలు.. రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Ap Assembly

Ap Assembly

AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి.. ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన విషయం విదితమే కాగా.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ అదే రోజు ప్రసంగించారు. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపింది సభ.. ఇక, ఈ నెల 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.. చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగనుంది.. చర్చ అనంతరం ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన సమాధానం ఇవ్వనున్నారు.. ఇక, సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు -2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు -2024ను సభ ముందుకు రానున్నాయి.

Read Also: TS Assembly: ఇవాళ్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

ఇక, శాసన మండలి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగియనున్నాయి.. చివరి రోజు ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది శాసన మండలి.. పలు శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మండలిలో చర్చ సాగనుండగా.. ఆ చర్చ అనంతరం మండలిలో కూడా సమాధానం ఇవ్వనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన.. మరోవైపు.. మండలిలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. నిన్న అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను ఈ రోజు శాసన మండలిలో పెట్టనుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. మొత్తంగా ఇవాళ్టితో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.

Exit mobile version