ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రస్సింగ్ మరియు బాడీ పార్ట్స్‌పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యల పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించగా. ఇందులో ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, అలా మాట్లాడటం తప్పని గట్టిగా వాదించారు. అయితే దీంతో సోషల్ మీడియాలో అనసూయకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు నెటిజన్లు అనసూయనే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. ముందు మీరు వేసుకునే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలని, పద్ధతిగా ఉండాలని ఆమెకు ఉచిత సలహాలు ఇస్తూ సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా..
Also Read : Psych Siddharth : డబ్బు కాదు.. గుర్తింపు కావాలి- నందు
ఎన్ని విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గని అనసూయ, తనదైన శైలిలో వాటికి సమాధానమిస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న అత్యంత హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్లకు షాక్ ఇచ్చారు. బికినీలో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. తనపై వచ్చే విమర్శలను లెక్క చేయకుండా, తనకు నచ్చినట్లుగా జీవిస్తాననే సంకేతాన్ని ఈ ఫోటోల ద్వారా ఆమె మరోసారి పంపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
