NTV Telugu Site icon

Ananya Pandey: విరాట్ కోహ్లీనే నా క్రష్..

Ananya

Ananya

బాలీవుడ్ నటి అనన్య పాండేకి క్రికెట్‌పై ఉన్న ప్రేమ, ఇష్టం అందరికీ తెలిసిందే.. ఆమె ఐపీఎల్ (IPL) సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)కి మద్దతుగా కనిపించింది. అనన్య ఇటీవల భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఒక యాడ్‌లో నటించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 సంవత్సరంలో అనన్య సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో శ్రేయ రంధవా అనే పాత్రలో నటించింది.

Read Also: #Life Stories Review: ‘#లైఫ్ స్టోరీస్’ రివ్యూ

అయితే.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని అనన్య పాండే చెప్పింది. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాల్ మీ బే’ ప్రమోషన్లలో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ గ్లోబల్ ఐకాన్. ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది. విరాట్‌లోని నాయకత్వ లక్షణాలు, జట్టును నడిపించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అని ఆమె పేర్కొన్నారు.

Team India: 28 ఏళ్లు నిండకుండానే టెస్టు కెరీర్‌కి గుడ్ బై చెప్పిన భారత ఆటగాళ్లు..!

అనన్య పాండే తాను ఇటీవల నటించిన యాడ్‌లో శుభ్‌మన్ గిల్ పేరును చెప్పలేదు. ఎందుకంటే.. ఈ యాడ్ తర్వాత వీరి మధ్య ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు.. హార్దిక్ పాండ్యా పేరును కూడా చెప్పలేదు. ఇటీవలే.. అనంత్ అంబానీ వివాహ వేడుకలో ఆమె మాట్లాడుతూ.. హార్దిక్ గొప్ప ఆల్ రౌండర్ అని చెప్పుకొచ్చింది. భారత్‌కు టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ తీసుకొచ్చిన రోహిత్ శర్మ పేరు కూడా అనన్య చెప్పలేదు.

Read Also: Minister Ram Prasad Reddy: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

Show comments