టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం ఆయిన అనన్య తన క్యూట్ లుక్స్ తో, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ తరువాత వచ్చిన పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ మూవీతో అనన్యకి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తరువాత అనన్యకి వరుసగా సినిమాలలో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. హీరోయిన్ గా కూడా ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అనన్య నాగళ్ల తాజాగా నటించిన తంత్ర సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శుద్ర శక్తులు వున్న అమ్మాయిగా అనన్య ఎంతో అద్భుతంగా నటించింది.. అలాగే తన అందంతో కూడా ఈ భామ ప్రేక్షకులను ఆకట్టుకుంది..అయితే ఈ సినిమా తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో అనన్య ప్రేక్షకుల ముందుకురాబోతుంది.
ఆమె నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్’. ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ‘బంధం రేగడ్’, ‘సవారీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకురి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు… తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి చిత్రయూనిట్ టీజర్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్‌ను శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్ మరియు చత్రపతి శేఖర్ వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు..
3 Days To Go!
Take a peek at the humane tale of #Pottel with the uplifting Teaser 🤩
Mark the Date – #PottelTeaser on April 18th 💥
🎬 by @MothkuriSaahith
💰 by @nishankreddy17 @SureshKSadige
@YuvaChandraa @AnanyaNagalla @NisaEnt @pscreations_psc #ShekarChandra @mrnoelsean… pic.twitter.com/7WcxBdLBaM— BA Raju's Team (@baraju_SuperHit) April 15, 2024