Site icon NTV Telugu

Anant Ambani Radhika Merchant Reception: మొదలైన అనంత్-రాధిక రిసెప్షన్..వేదిక వీడియో విడుదల..

Radika

Radika

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తారాలోకం మెరిసిపోయింది. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, రాధికా మర్చంట్‌ల కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరై సందడి చేశారు. శనివారం (జూన్ 13) ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ దంపతులను ఆశీర్వదించడమే కాకుండా వారికి ప్రత్యేక బహుమతిని కూడా అందించారు. ఈ వేడుకకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.

READ MORE: Crime: 5 నెలల పాపపై అత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో మూడవ రోజు గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. అంబానీ ఫ్యామిలీ ఈరోజు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. రిసెప్షన్ కోసం అంబానీ కుటుంబం యాంటిలియాకు బయలుదేరింది. ఈ వేడుకకు ప్రముఖులు హాజరుకానున్నారు. పలువురు బాలీవుడ్ తారలు, రాజకీయ నేతలు రానున్నారు. అనంత్, రాధిక రిసెప్షన్ వేదిక మొదటి వీడియో బయటకు వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద పెద్ద స్క్రోల్‌లు వేలాడదీశారు. దానిపై శ్లోకాలు రాసి ఉన్నాయి.

Exit mobile version