Site icon NTV Telugu

Anant Ambani Wedding: స్టార్ హీరోల ఇంటికి అనంత్‌ అంబానీ.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక ఆహ్వానం!

Anant Ambani Radhika Merchant

Anant Ambani Radhika Merchant

Anant Ambani Meets Ajay Devgn: అపరకుబేరుడు, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంట త్వరలో పెళ్లిభాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ సీఈఓ వీరెన్‌ మర్చంట్‌ కూతురు రాధిక మ‌ర్చంట్‌ను అనంత్ పెళ్లి చేసుకోనున్నారు. వివాహ వేడుకకు ముహూర్తం సమీపిస్తోన్న నేపథ్యంలో అంబానీ ఫామిలీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉంది. అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది.

తమ పెళ్లికి రావాలంటూ ప్రముఖులు, సన్నిహితుల ఇంటికి వెళ్లి మరీ అనంత్‌ అంబానీ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన రోల్స్‌ రాయిస్‌ కారులో బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. అక్షయ్‌కు స్వయంగా కార్డు ఇచ్చి.. ​కుటుంబసమేతంగా తన పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపై మరో స్టార్ హీరో అక్షయ్‌ దేవ్‌గణ్‌ ఇంటికి వెళ్లి తన వెడ్డింగ్‌ కార్డ్‌ ఇచ్చారు. ‘

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జులై 12న జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సెలబ్రేషన్స్‌ జూలై 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా జరుగన్నాయట. ఈ వివాహ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌ వేదికగా మారనుంది. అనంత్ అంబానీ పెళ్లి కార్డు తాలూకు వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆహ్వాన ప‌త్రికను ఒక ప్ర‌త్యేక పెట్టె రూపంలో ఉంది. దీనికి లైట్లు, ఎరుపు రంగుతో అలంకరించారు. బాక్స్ ఓపెన్ చేయ‌గానే.. ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. పెట్టెలో వెండితో చేసిన ఆల‌యం ఉంటుంది. లోప‌ల వెండితో చేసిన‌ వినాయ‌కుడు, దుర్గామాత‌, రాధాకృష్ణ విగ్ర‌హాలు ఉన్నాయి. ఈ వెండి కార్డుతో పాటు ప‌లు బహుమతులు కూడా అంబానీ ఫ్యామిలీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version