Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anant Ambani in AP: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల అభివృద్ధికి రిలయన్స్ సహకారాన్ని వివరించారు అంబానీ.. ఏపీలో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి రిలయన్స్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రూ.లక్ష కోట్లతో చేపడుతున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు కీలకంగా ఉంటాయని అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దేశంలో అగ్రశ్రేణి వ్యవసాయ విద్యా సంస్థగా ఎదుగుతుందని అనంత్ అంబానీ అన్నారు. రైతులను తమ కమతాలకే సీఈవోలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. ఏఐ, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రెసిషన్ ఫార్మింగ్‌కు సహకరిస్తామని తెలిపారు. నీరు, ఎరువులను సమర్థంగా వినియోగించుకునేలా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని పేర్కొన్నారు. మదనపల్లె టమాటా రైతులకు మార్కెట్ సమాచారం, విక్రయ అవకాశాలపై మార్గదర్శనం చేస్తామని చెప్పారు.
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
ఇక, రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా రైతులను ఊర్జా దాతలుగా మార్చేందుకు కృషి చేస్తామని అనంత్ అంబానీ తెలిపారు. సీబీజీ ప్లాంట్ల కోసం రిలయన్స్ రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. పశుసంపద అభివృద్ధికి హైటెక్ యానిమల్ హజ్బెండ్రీ ప్రాజెక్టులు చేపడతామని, జియో కృషి ద్వారా రైతుల ఇంటి ముంగిటకే సాంకేతిక సేవలు అందిస్తామని వెల్లడించారు. జామ్ నగర్లో బయో ఎనర్జీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘దేశ సేవా–కిసాన్ సేవా’ అన్నదే రిలయన్స్ లక్ష్యమని పేర్కొన్నారు అనంత్.. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రం 388 మెగా పెట్టుబడులు, రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 11 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు రిలయన్స్ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనంత్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కూడా ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించి, రాష్ట్రానికి తాను ఏమి చేయగలనో గైడ్ చేయాలని చంద్రబాబును కోరుతున్నానని తెలిపారు. గ్రామీణ వాణిజ్యం, సుస్థిర గ్రామాల నిర్మాణానికి ఈరోజు పునాది వేస్తున్నామని అన్నారు. ఆంధ్రభూమిని స్వర్ణభూమిగా మార్చే దిశగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ..
తాజావార్తలు
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?