NTV Telugu Site icon

Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

3

3

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నెటిజన్లతో పలు విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వీటితోపాటు., సృజనాత్మకత, ప్రతిభను ఎక్కడున్నా ప్రోత్సహించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే తాజాగా అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సహాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడలిని రక్షించిన 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చాడు.

Also Read: Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదేశం..

“ఈ సాంకేతిక యుగంలో మనముందున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే.. మనం టెక్నాలజీకి బానిసలుగా మారతామా లేక యజమానులుగా మిగిలిపోతామా.. కానీ, ఈ అమ్మాయి సమయస్ఫూర్తి చూస్తుంటే టెక్నాలజీ ఎప్పుడూ మనిషి ఆదేశాలను పాటిస్తుందనే ఆశ కలుగుతుంది. అమ్మాయి ప్రవర్తన ఆశ్చర్యంగా ఉంది. తన చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంది, ఇందుకుగాను మహీంద్రా రైజ్‌ లో చేరాల్సిందిగా ఆమెను ఆహ్వానిస్తున్నాం.,’ అంటూ పోస్ట్ చేసాడు.

మహీంద్రా పోస్ట్ వైరల్ కావడంతో., నెటిజన్లు ఈ నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మేం టెక్నాలజీలో మాస్టర్స్ అవుతాం’ అంటుండగా. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఆలోచన అద్భుతం.. నేటి తరం తెలివితేటలు మన ఊహకు అందనివి అంటూ పేర్కొన్నాడు.

Also Read: Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..

ఇకపోతే ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన నికిత అనే బాలిక తన మేనకోడలు వామిక తో ఆడుతుండగా కోతుల గుంపు వారి ఇంట్లోకి ప్రవేశించింది. కోతులు ఇంటిలోని పాత్రలను విసిరి బీభత్సం సృష్టించాయి. వామిక దగ్గరికి ఒక కోతి వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులెవరూ చుట్టుపక్కల లేకపోయినా బాలిక భయపడలేదు. సమయానుకూలంగా ఆలోచించడంతో, ఇంట్లో వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను చూడగా.. వెంటనే ఆ అమ్మాయి.. ‘‘అలెక్సా.. కుక్కలా మొరుగు’’ అని ఆదేశించింది. దాంతో వెంటనే, అలెక్సా కుక్క మొరిగినట్లు పెద్ద శబ్దాలు చేయడం ప్రారంభించింది. కోతులు భయపడి అక్కడి నుంచి పారిపోయాయి.