Anam Ramanarayana Reddy: ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటాం.. ఆక్రమణకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవదాయ శాఖ ఇప్పించే విధంగా చర్యలు చేపడతాం అన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయ.. ఏపీ ప్రభుత్వ దేవాదాయ మంత్రిగా తొలి సంతకం చేశారు.. ఇక, నేటి నుంచి పూర్తిగా శాఖ పైన అన్ని రకాల చర్యలు, నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.. మంత్రి బాధ్యతల స్వీకరణకు అనేక ప్రాంతాల నుంచి ఆలయ పాలకవర్గ అధికారులు వచ్చారు.
Read Also: Canada vs Iran: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా..
ఇక, 3వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో తమ కార్యాలయంలో పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి ఆనం.. ధర్మాన్ని మనం కాపాడితే.. అదే మనల్ని, ప్రజల్ని కాపాడుతుందన్న ఆయన.. ఆలయాల నిర్వహణ పట్ల గతంలో అనేక కథనాలు వచ్చాయి. ప్రభుత్వం సరిచేసుకొని వెళ్లాలి.. మొదటిసారి జరిగితే దాన్ని తప్ప రెండోసారి జరిగిన స్వయంకృత అపరాధం కింద పరిగణిస్తాం న్నారు. దేవాలయాల ప్రక్షాళన మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నాము.. తమ అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచారు.. త్రిదండి చిన్న జీయర్ స్వామిని కలిసి సలహాలు ఇవ్వాలని కోరాను.. అందరూ పీఠాధిపతులు, మతాధిపతులను కలిసి వారి ఆశీస్సులు తీసుకొని వారి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు.. 26 వేలకు పైగా ఆలయాలకు పాలకవర్గాలు, ఆస్తులు ఉన్నాయి.. కానీ, దీపం పెట్టే పరిస్థితి లేదన్నారు. ధూప దీప నైవేధ్యం కోసం కార్యక్రమం తీసుకుంటామన్నారు.. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి.. అన్ని కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తాం అన్నారు.
Read Also: Kishan Reddy: నితిన్ గడ్కరితో కిషన్ రెడ్డి సమావేశం.. ప్రాజెక్టుల అభివృద్ధిపై చర్చ
దేవాలయాల అభివృద్ధి పునరుద్ధరణ వంటి విషయాలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తరువాతే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు ఆనం రామనారాయణరెడ్డి.. ఆలయాల కమిటీ కాలపరిమితి ప్రకారం కొత్త వాటి నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు.. తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈవోగా శ్యామలరావును నియమించారు.. అన్ని ఆలయాల్లో పవిత్రత నిలబడేలా, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హిందూ ధర్మాన్ని కాపాడటమే దేవాదాయశాఖ బాధ్యత.. న్యాయస్థానం, చట్టపరిధిలో ఉన్న స్థల ఆక్రమణ విడుదలకు చర్యలు చేపడతాం.. ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.