Canada vs Iran: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా..
- కెనడా- ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న వివాదం..
- ఐఆర్‌జీసీని తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చిన కెనడా..
- కెనడా నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada vs Iran: ఇరాన్ కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను (IRGC) కెనడా తీవ్రవాద సంస్థ జాబితాలో బుధవారం నాడు చేర్చింది. దీనిపై తాజాగా స్పందించిన ఇరాన్.. కెనడా చర్యను తీవ్రంగా ఖండించింది. కెనడా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ద్వారా గార్డ్స్ సైనిక శక్తి ఎలాంటి ప్రభావానికి లోనుకాదు అని వెల్లడించింది. ఇది అవివేకమైన, సాంప్రదాయేతర రాజకీయ- ప్రేరేపిత చర్య అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ ఇవాళ (గురువారం) స్థానిక వార్తా ఏజెన్సీకి తెలిపారు. కెనడా ప్రతిపక్ష శాసనసభ్యులు, కొంత మంది సభ్యుల ఒత్తిడితో కెనడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది పేర్కొన్నారు.
Read Also: JBL Live Beam 3 Price: జేబీఎల్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్!
Also Read
ఇక, రెవల్యూషనరీ గార్డ్స్‌ను తీవ్రవాద సంస్థగా జాబితాలో చేర్చడంతో ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న మాజీ సీనియర్ ఇరాన్ అధికారుల విచారణకు దారి తీసే అవకాశం ఉంది. గార్డ్స్‌లోని ఉన్నతాధికారులతో సహా వేలాది మంది సీనియర్ ఇరాన్ ప్రభుత్వ అధికారులు కెనడాలోకి రావడానికి నిషేధం విధించినట్లైంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఇరాన్‌లో ప్రధాన సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదిగారు. దీనికి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. మిత్రరాజ్యాల ప్రభుత్వాలు, సాయుధ సమూహాలకు డబ్బు, ఆయుధాలు, సాంకేతికత, శిక్షణ, సలహాలను ఇది అందిస్తుంది.
Read Also: Minister Anagani Satya Prasad: రెవెన్యూ శాఖను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా..
కాగా, 2019లో అమెరికా మొదటగా ఐఆర్‌జీసీని తీవ్రవాద సంస్థగా గుర్తించింది.. ఆ తర్వాత ఇప్పుడు రెండో దేశంగా కెనడా ఉంది. ఇదిలా ఉంటే, 2020 జనవరిలో విమానం పీఎస్752 పై రివల్యూషనరీ గార్డ్స్ క్షిపణి దాడి చేయడంతో అందులో ఉన్న 175 మంది ప్రయాణికులు చనిపోయారు. వీరిలో 55 మంది కెనడియన్ పౌరులు ఉండగా, మరో 30 మంది కెనడా శాశ్వత నివాసితులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత స్పందించిన ఇరాన్ పొరపాటున విమానంపై క్షిపణి దాడి జరిగిందని వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?