Site icon NTV Telugu

Anam Ramanarayana Reddy: వివరణ ఇవ్వడానికి స్పీకర్ను 4 వారాల సమయం కోరాం..

Anam

Anam

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ చీఫ్ విప్ తమ పై ఫిర్యాదు చేశారని స్పీకర్ చెప్పారన్నారు. కంప్లైంట్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా విచారణలో ఉండాలని తాను స్పీకర్ ని కోరినట్లు తెలిపారు.

Viswambhara: సంక్రాంతిపై కన్నేసిన బాసు.. రిలీజ్ డేట్ ఫిక్స్?

కంప్లైంట్ ఇచ్చిన చీఫ్ విప్ విచారణలో ఉండాల్సిన అవసరం లేదని స్పీకర్ చెప్పారని పేర్కొన్నారు. ఒరిజనల్ సీడీలు, పేపర్ క్లిప్పింగ్ లు, డాక్యుమెంట్లు కావాలని అడిగామని తెలిపారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవాల్సిన అవసరం లేదని స్పీకర్ చెప్పారన్నారు. తమ వాదన వినిపించడానికి నాలుగు వారాల సమయం కావాలని అడిగామని రామనారాయణ రెడ్డి తెలిపారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని లెటర్ పెట్టామని చెప్పారు. కాగా.. న్యాయవాదిని పెట్టుకోవడానికి సమయం ఇవ్వలేము అని స్పీకర్ చెప్పారన్నారు.

Koratala Siva: శ్రీమంతుడు కథ కాపీ కేసులో కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్

ఇవాళ జరిగిన విచారణ అంతా ఒక ప్రహసనంగా ఉందని తెలిపారు. స్పీకర్ ఇచ్చే ఆదేశాలు తర్వాతి తరానికి మార్గదర్శనం కావాలి అన్నట్లు తెలిపారు. గతంలో స్పీకర్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తనకు అవసరం లేదు అన్నారని చెప్పారు రామనారాయణ రెడ్డి. తమకు మూడు సార్లు సమయం ఇచ్చాను అని స్పీకర్ అన్నారు.. అసెంబ్లీ బుక్ లో మూడు సార్లు సమయం ఇవ్వాలని ఉందా..?అని ప్రశ్నించినట్లు తెలిపారు. తాను మూడు దఫాలకే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను అన్నట్లు రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version