Koratala Siva: శ్రీమంతుడు కథ కాపీ కేసులో కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Schock to Koratala Siva in Srimanthudu Copyright Case: కాపీరైట్స్ కేసులో కొరటాల శివకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొరటాల శివ దర్శకుడిగా మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే చచ్చేంత ప్రేమ పేరిట తాను రాసిన నవల కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి శ్రీమంతుడు పేరుతో ఒక సినిమా చేశారని డైరెక్టర్ శివ కొరటాల, నిర్మాతలు ఎర్నేని రవి, ఏఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద శరత్ చంద్ర అనే రచయిత ఒక క్రిమినల్ కేసు పెట్టారు. అయితే ఆ క్రిమినల్ కేసును సవాల్ చేస్తూ కొరటాల శివ, ఎర్నేని రవి, ఏఎంబి ఎంటర్టైన్మెంట్ లు వేరువేరుగా ముందుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో కాపీ రైట్ యాక్ట్ కింద డైరెక్టర్ కొరటాల శివ విచారణ ఎదుర్కోవాల్సిందేనని హై కోర్టు గతంలో తేల్చి చెప్పింది.
Viswambhara: సంక్రాంతిపై కన్నేసిన బాసు.. రిలీజ్ డేట్ ఫిక్స్?
Also Read
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
అయితే, ఆ మూవీ నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌లపై కాపీ రైట్‌యాక్ట్ కేసు చెల్లదని చెప్పింది. వీళ్లపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేయాలన్న కథ రచయిత శరత్ చంద్ర (ఆర్డీ విల్సన్) అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టులో అపీల్ చేశారు కొరటాల శివ. సుప్రీం కోర్టు కూడా నాంపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పింది. శ్రీమంతుడు కథలో స్వల్ప మార్పులు ఉన్నాయని 8 మంది రచయితల కమిటీ చెప్పడంతో డైరెక్టర్ కాపీ రైట్ యాక్ట్ నిబంధనల ప్రకారం విచారణ ఎదుర్కోవాలి, దర్శకుడే కథా రచయతకు, స్రీన్‌ప్లేకు సొమ్ము చెల్లించారని హైకోర్టు పేర్కొంది. కథనంలో మార్పులు చేసి తన కథ అంటే కుదరదు. ఇలాంటి వ్యవహారాలపై విచారణను ఎదుర్కోవాలి అయితే ఈ వ్యవహారంతో నిర్మాతకు సంబంధం లేదని పేర్కొంది.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!