Ram Gopal Varma: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి.. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో నమోదైన కేసు విషయంలో విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు.. ఎదురుదెబ్బ తగలడంతో.. అదే కేసులో ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేశారు.. అయితే, ఇప్పుడు తాజాగా కడపలో.. అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు.. అంతేకాదు.. నేడు విచారణకు రావాలని నోటీసులు కూడా పంపించారు.. అయితే, షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉండడం వలన ఈ రోజు విచారణకు హాజరు కాలేనని లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపించారు రాంగోపాల్ వర్మ… మరో వారం రోజుల పాటు సమయం ఇవ్వాలని పోలీసులను కోరారు రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాదులు..
Read Also: RotiKapdaRomance : వారం రోజులు ముందుగా రోటి కపడా రొమాన్స్ ప్రీమియర్స్
మరోవైపు.. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. సీఐ రామకృష్ణకు ఐ టీడీపీ నేతలు ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, హోమ్ మంత్రి వంగలపూడి అనితపై ఆర్జీవీ అసభ్యపోస్టులు పెట్టారు.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల మూలాలను గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని కోరారు.. ఆర్జీవీది క్రిమినల్ మనస్తత్వం.. మహిళలను సైతం కించపరిచే విధంగా పోస్టులు పెడతారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.. ఇక, ఆర్జీవీని జనజీవన స్రవంతిలో ఉంచవద్దు.. అరెస్ట్ చేసి అడవులకు తరలించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు..