Naga Vamsi: తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ అంటే.. పెద్ద పండగ. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్లలో సందడి సృష్టిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీలో.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎమోషన్‌తో వన్ మ్యాన్ షో చేశాడు. అలాగే మీనాక్షి చౌదరితో ఆయన కెమిస్ట్రీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. నాన్‌స్టాప్ ఫన్, చివర్లో భావోద్వేగాలు.. ఇదీ సినిమా స్పెషాలిటీ అని ప్రేక్షకులు చెబుతున్నారు.
READ ALSO: Top Deals : Echo, Fire TV Deviceలపై భారీ తగ్గింపులు.!
ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర థ్యాంక్స్ మీట్లో.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సంక్రాంతికి 1000% satisfy చేసినందుకు.. 2026 జర్నీని సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అవ్వటానికి.. నాకు పూర్తిగా సపోర్ట్, హెల్ప్ చేసిన నవీన్ పొలిశెట్టికి స్పెషల్ థాంక్స్. ఎప్పుడు సినిమా వచ్చి పోవడం ఇవన్నీ ఓకే కానీ, సంక్రాంతి టైంలో సినిమా వచ్చి ఆడటం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అవుతుంది.. నిర్మాతకైనా, డైరెక్టర్‌కైనా, హీరోకైనా. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుకు ఉంటుంది.. సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన సినిమాల లెక్కలో. అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ముఖ్యం” అని చెప్పారు. సినిమా లాభాల కంటే ఈగో సాటిస్ఫాక్షన్, సంక్రాంతి హిట్ అయ్యిందనే దాంట్లో ఉండే ఆనందం వేరని చెప్పారు. మైకీ జే. మేయర్ మ్యూజిక్, రూరల్ బ్యాక్‌డ్రాప్, నవీన్ హాస్యం.. ఇవన్నీ కలిసి ‘అనగనగా ఒక రాజు’ని సంక్రాంతి సూపర్ హిట్‌గా మార్చాయని ప్రేక్షకులు చెబుతున్నారు.
READ ALSO: Mumbai Municipal Elections: ముంబై ఎన్నికల్లో ఓవైసీ పార్టీ హవా
