తారక రామ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బిటిఆర్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్, జెడిఆర్ చెరుకూరి, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రశేఖర్ కొమ్మాలపాటి, ప్రభ అగ్రజ కీలక పాత్రలు చేశారు. రియల్ లొకేషన్లలో షూట్ చేయబడిన నెవర్-సీన్-బిఫోర్ థ్రిల్లర్‌గా.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ప్రధానంగా మెల్బోర్న్లో తెరకెక్కింది. 83 విభిన్న లొకేషన్లలో 122 రోజుల పాటు షూటింగ్ జరిగింది. దాంతో ప్రతి ఫ్రేమ్ నిజమైన వాస్తవికతను కలిగి ఉంది. ఫారిన్ లొకేషన్లలో సాగే కథలో ఆ స్థానిక వాతావరణాన్ని దర్శకుడు తారక రామ అద్భుతంగా మలిచారు. అరుణ్ దొండపాటి డోపీగా పనిచేసిన ఈ చిత్రంలో ప్రతి షాట్ ఒక స్టన్నింగ్ విజువల్ ట్రీట్‌గా అనిపిస్తుంది. ఫిల్మ్గ్రేడ్ కలర్ టోన్, క్లాస్ వర్ధమాన ఛాయాచిత్రకళను అద్భుతంగా ఉపయోగించారు.
నిత్యం ఊహించలేని మలుపులతో సినిమా మొదటి నుంచీ చివరి వరకూ ఆసక్తికరంగా నడిపిస్తుంది. ఎన్నో థ్రిల్లర్ మూవీస్ చూసిన ప్రేక్షకులకే.. కొత్త అనుభూతిని కలిగించేలా స్క్రీన్‌ప్లే ఉంది. యూవి నిరంజన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. మణిరత్నం – ఆర్జీవీ – శంకర్ ల టేకింగ్ మిక్స్‌తో క్వెంటిన్ టారంటినో శైలిలో డైరెక్షన్ చేసిన తారక రామ.. స్టోరీ నేరేషన్ పరంగా ఒక ప్రత్యేకమైన ఒరవడి నెలకొల్పారు. డైలాగ్స్ నేచురల్‌గా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి పాత్రకు డెప్త్ ఉంది. టాలీవుడ్లో చాలా తక్కువగా కనిపించే Neo-Noir Thriller జానర్లో వచ్చిన అనగనగా ఆస్ట్రేలియాలో చిత్రం.. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌తో టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉంది.
ప్రేక్షకులు సినిమా విజువల్స్, స్క్రీన్‌ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నెరేషన్ స్టైల్‌కి ఫిదా అయ్యారు. కథనం, ఫ్రేమింగ్‌లో కొత్తదనాన్ని కోరే ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే ప్రయత్నంగా అనగనగా ఆస్ట్రేలియాలో నిలుస్తుందని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు అంటున్నారు. విదేశాల్లోని యథార్థ సంఘటనల ఆధారంగా తెరక్కేక్కిన ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆస్వాదించండి.
Rating: 2.5/5