Home Minister Vangalapudi Anitha: గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గంజాయి నివారణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు సమావేశమై చర్చించింది.. బోర్డర్లల్లో చెక్ పోస్టులను పటిష్టం చేయాలని అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం సూచించింది. గంజాయి సాగుని అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు. గంజాయి సాగు చేసే పేదలు, గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కేబినెట్ సబ్ కమిటీ.. ఇక, మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత.. గంజాయి సాగు చేయాలని గిరిజనులను కొందరు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.. పేద గిరిజనులు కాఫీ సాగు వైపు కాకుండా.. గంజాయి సాగు వైపు మళ్లించేలా కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. గత ప్రభుత్వం సెబ్ ఏర్పాటు చేసినా గంజాయితో పాటు ఇసుక, ఎర్ర చందనం అక్రమ రవాణ బాధ్యతలు కూడా సెబ్ కే కేటాయించారని ఆరోపించారు.
Read Also: Karisma Kapoor: స్నేహితులతో గడపాలని టార్చర్ చేశాడు.. భర్తపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
అయితే, గంజాయి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు మంత్రి అనిత.. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (ANTF) ఏర్పాటు చేస్తాం అన్నారు. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ANTF ఏర్పాటు చేస్తామని.. గంజాయి కట్టడికి.. ఫిర్యాదులు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయికి బాధితులకు డి-ఎడిక్షన్ సెంటర్లపై ఫోకస్ పెడతాం. సరైన ఉపాధి, విద్యా సౌకర్యం లేకపోవడం వల్ల గిరిజన యువత పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం గిరిజనులే గంజాయి క్యారియర్లుగా ఉన్నారు. జైళ్లల్లో 15 ఏళ్ల నుంచి గంజాయి రవాణా చేసిన గిరిజన యువకులు ఉన్నారు. గంజాయిని ప్రొత్సహిస్తోన్న కింగ్ పిన్ల మీద ఫోకస్ పెడతాం అని హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయిని వీలైనంత వరకు కట్టడి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తాం. గంజాయిని అరికట్టేలా పొరుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతాం అన్నారు మంత్రి అనిత.
Read Also: D. Sridhar Babu: వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతాం..
ఇక, ANTF కేవలం డ్రగ్స్ కోసమే ఉంటుంది. బోర్డర్లల్లో మరిన్ని చెక్ పోస్టులు పెడతాం.. నిఘా పటిష్టం చేస్తాం.. పొరుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడేందుకు కార్యాచరణ సిద్దమవుతాం అన్నారు హోంమంత్రి అనిత.. కరోనా ఉన్న రెండేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం గంజాయి కట్టడిని పూర్తిగా వదిలేసిందని విమర్శించారు.. ఏడేళ్ల బాలుడు కూడా గంజాయి వినియోగించే పరిస్థితి.. అందుకే మేం సీరియస్ గా తీసుకున్నాం. డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ పెట్టుకుంటాం. గంజాయి సాగు విషయంలో ఏ పార్టీ వాళ్లు ఉన్నా ఊపేక్షించం.. కఠిన చర్యలు ఉంటాయి. గంజాయిపై ప్రభుత్వం యుద్దం మొదలైంది. కింగ్ పిన్, కీ-రోల్ పోషించే వారి సమాచారం మా దగ్గర ఉందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.
Read Also: Team India-PM Modi: ప్రధాని మోడీతో భారత క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్!