Site icon NTV Telugu

VH-Anjan Kumar: సీఎం ముందే వీహెచ్, అంజన్ కుమార్ మధ్య వాగ్వివాదం..

Vh Anjan Kumar

Vh Anjan Kumar

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా.. సీఎం ముందే వీహెచ్, అంజన్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. వీహెచ్ తన ప్రసంగంలో యాదవుల ప్రస్తావన చేయలేదని అంజన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమను తొక్కేస్తున్నారని అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన వీహెచ్.. నిన్ను రాజకీయాల్లోకి తెచ్చింది నేనే కదా అని అన్నాడు.. అయినా పార్టీ యాదవులకు ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు.

Read Also: Kamareddy: తోటి విద్యార్థినిల వేధింపులు.. ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం

మీ ఇంట్లో అనిల్‌కి ఎంపీ పదవి ఇచ్చింది.. నీకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదా అంటూ వీహెచ్ అంజన్ కుమార్ యాదవ్‌ను నిలదీశారు. అందుకు అంజన్ కుమార్ స్పందిస్తూ.. తన కుమారుడికి యాదవ కోటాలో పదవి రాలేదని.. యూత్ కాంగ్రెస్ కోటాలో వచ్చిందన్న అంజన్ కుమార్ జవాబిచ్చారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని ఘర్షణ పడటం సరికాదని.. కలిసి పని చేయాలని సూచించారు.

Exit mobile version