NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

ఉస్మానియా హాస్పటల్ నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఉన్న స్థలంలోనే ఉస్మానియా హాస్పటల్ నిర్మిస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “హైదరాబాద్ కు కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం ఉంటుంది. హై కోర్టు భవనం దేశానికి ఆదర్శంగా ఉండేలా నిర్మాణం ఉంటుంది. గత ప్రభుత్వంది అకౌంట్ అయితే మాది అకౌంబులిటి ప్రభుత్వం. టీమ్స్ ఆస్పత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆరోగ్యశాఖతో కలిసి మరోసారి సమీక్ష చేస్తాం. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ ను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చారు. మూడున్నర ఏళ్లలో RRR పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తులు చేయాలని అదేశించాం. విజయవాడ రోడ్డు అనగానే డెత్ రోడ్డు అనే పేరు ఉంది. డిసెంబర్ లోపు సిక్స్ లైన్ రోడ్డు పనులను మొదలు పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. రేపటి నుంచి ఫుల్ టైం యాక్షన్ లోకి దిగుదాం.. కేంద్రం నుంచి నిధులు తెస్తాం.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Darshan Wife: చిక్కుల్లో దర్శన్‌ భార్య.. ఏ1గా కేసు.. ఆమె కూడా అరెస్ట్?

తెలంగాణలో ఎక్కువశాతం రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ” పార్లమెంట్ లో ఇండియా కూటమి బలం ఉంది…కేంద్రం పై ఒత్తిది చేస్తాం. ఉప్పల్ ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్, అంబర్ పేట పనులు ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. మూడు నెలల్లో అంబర్ పేట పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశాం. తెలంగాణ భవనం ఢిల్లీలో 24 అంతస్తుల నిర్మించడం కూడా జరుగుతుంది. Dpr రెడీ అవుతుంది. హైదరాబాద్ దుర్గం చెరువు కేటీఆర్ కేవలం సెల్ఫీ కోసమే పనికొస్తుంది…ఒక గంట అక్కడ ఉంటే హాస్పటల్ పాలు అవ్వడం ఖాయం. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ టు బెంగుళూర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 5600 కోట్లతో రోడ్డు సాధిస్తాం. బకాయిలు అనేది పెద్ద సమస్య…పెద్ద రాష్ట్రం తెలంగాణ. బకాయిలు తీర్చడానికి కార్పొరేషన్ పెట్టీ ముందుకు వెళ్తాం. కేసీఆర్ మోడీతో వ్యక్తిగత పంచాయితీ ఉన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించింది. అక్టోబర్ లో ఫౌండేషన్, డిసెంబర్ లోపు RRR ప్రారంభించాలని అనుకుంటున్నాం.” అని వెల్లడించారు.

Show comments