ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌లో 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ హృదయ విదారకమైన సంఘటన బుధవారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి మాధవ్ గా గుర్తించారు. అయితే.. క్లాస్ మధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డయింది.
Read Also: Traffic Restrictions: వాహనదారులకు హెచ్చరిక.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు..
కాగా.. యువకుడు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) ప్రవేశ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్నాడు. రోజులాగే బుధవారం కోచింగ్ సెంటర్ కు వెళ్లాడు. కోచింగ్ సెంటర్ లో క్లాసులు వింటున్న సమయంలో సడన్‌గా టేబుల్ వైపు వంగి, ఏదో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. ఇంతలో పక్కనే కూర్చున్న ఓ విద్యార్థి మాధవ్ వీపు మీద నొక్కడం మొదలుపెట్టాడు. అతనికి ఇంకా నొప్పిగా ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని ట్రైనర్ కు చెప్పాడు. కొంత సేపటికే మాధవ్ పూర్తిగా టేబుల్ మీద నుండి జారి నేలపై పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులు సాయం చేసేందుకు వచ్చారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కొంత సేపటికే విద్యార్థి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా.. గత కొన్ని వారాల్లో ఇండోర్‌లో దాదాపు నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Ram Mandir: సైబర్ ఎటాక్ కి ఛాన్స్ ఉందని హోం శాఖ హెచ్చరిక.. అయోధ్యకు నిపుణుల బృందం