ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌లో 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ హృదయ విదారకమైన సంఘటన బుధవారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి మాధవ్ గా గుర్తించారు. అయితే.. క్లాస్ మధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో…