అమృత అయ్యర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తమిళ్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో కూడా రెండు మూడు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ తో ఈ అమ్మడి పేరు తెగ చక్కర్లు.. ఈమె గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఈ అమ్మడు పుట్టింది తమిళనాడు లో అయిన పెరిగింది మాత్రం కర్ణాటకలో.. డిగ్రీ చదివిన అమృత తర్వాత మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది.. తెలుగు, తమిళ్ లో వరుస సినిమాల్లో మెరుస్తుంది.. లింగా, తెనాలిరామన్; 2016లో పొక్కిరి రాజా, తేరి వంటి చిత్రాల్లో అనేక గుర్తింపు లేని పాత్రల్లో నటించింది..
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.. 2021లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్‌లో రామ్ పోతినేని సరసన హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అనుకున్న పేరును తీసుకురాలేదు.. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అదే ఏడాది విష్ణు సరసన అర్జున ఫాల్గుణ మూవీలో నటించింది. ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హీట్ ను అందుకున్న హనుమాన్ చిత్రంలో తేజాకు జోడిగా నటించింది.. ఇక తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా పింక్ డ్రెస్సులో ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..