NTV Telugu Site icon

Amrit Pal Singh : ఎట్టకేలకు చిక్కాడు.. అమృత్ పాల్ సింగ్‎ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు

Amrit

Amrit

Amrit Pal Singh : దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు. రెండు రోజుల క్రితమే అమృత్ పాల్ భార్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని మోగా జిల్లాలో పోలీసుల ఎదుట అమృత్‌పాల్ లొంగిపోయాడు. అర్థరాత్రి సమయంలో మెగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన పోలీసుల వద్ద సరెండర్ అయ్యాడు.

Read Also: IPL2023 : సొంత తప్పిదాలతో ఓడిన లక్నో.. డెత్ ఓవర్స్ లో గుజరాత్ బౌలింగ్ అదుర్స్

అమృత్ పాల్ సింగ్ “వారిస్ పంజాబ్ దే” సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అమృత్ పాల్ పంజాబ్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ.. పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినప్పటికీ అలాజరగలేదు. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ కోసం విస్తృతంగా గాలించారు. దీంతో ఎటూ పోలేని పరిస్థితుల్లో రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్ పాల్.. ఇక పోలీసుల నుంచి తప్పించుకుని పోయే పరిస్థితి లేకపోవటంతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

Read Also: Rahul Gandhi : రెండ్రోజుల పర్యటన నిమిత్తం నేడు కర్ణాటకు రాహుల్ గాంధీ

ఇతను పంజాబ్ లో ఖలిస్థానీ కార్యకలాపాలను సాగించాడు. అల్లర్లు సృష్టించినట్లు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ పై కేసులు పెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. ఖలిస్థానీ అనుకూల నాయకుడిని అస్సాంలోని దిబ్రూఘర్ జైలుకు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అమృతపాల్ సింగ్ మరో ఇద్దరు సహాయకులు పంజాబ్‌లోని మొహాలీలో ఏప్రిల్ 18న పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేయబడ్డారు.

Show comments