హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ నాలా ప్రక్కన పడిఉన్న అమ్మోనియం గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయితే, గ్యాస్ పీల్చిన 10 మందికి అస్వస్థతకు గురి కావడంతో వారిని బీబీఆర్ హాస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాంలో ఐదుగురు స్వల్ప అస్వస్థతకు గురైన వారిని చికిత్స అనంతరం డిచార్చ్ చేశారు. మిగతా వారికి మెరుగైన చికిత్సను వైద్యులు అందిస్తున్నారు.
Read Also: Asian Games 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! జట్టులోకి తెలుగు ఆటగాడు
నాలా ప్రక్కన పడివున్న సిలెండర్స్ ఇత్తడి వాల్వ్ ను తీయడానికి దుండగుడు ప్రయత్నించడంతో గ్యాస్ లీక్ అయింది. అయితే.. ఈ తుప్పు పట్టిన అమ్మోనియం సిలెండర్స్ ఇక్కడికి ఎలా వచ్చాయని సవన్ నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డు చివరన చెత్త కుప్పల్లో చాలా కాలం నుంచి రెండు అమ్మోనియా గ్యాస్ సిలిండర్లు పడి ఉన్నాయి. అయితే.. ఈ సిలిండర్లను గమనించిన ఓ దొంగ.. గ్యాస్ సిలిండర్లకున్న ఇత్తడి వాల్వ్‌లు తీసుకునేందుకు ప్రయత్నం చేశాడు అని పోలీసులు తెలిపారు.
Read Also: Ram Charan: రామ్ చరణ్ కూతురుకు.. తన రేంజ్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ
సిలిండర్ వాల్వ్‌ను రాడ్డుతో కొట్టి సదరు దొంగ తొలిగించబోయాడు.. ఈ తరుణంలోనే.. సిలిండర్ నుంచి పెద్ద ఎత్తున అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది అని పోలీసులు పేర్కొన్నారు. సిలిండర్లను పగలగొట్టిన దొంగ పారిపోవడంతో.. గాల్లో 15 మీటర్లకు పైగా గ్యాస్ వ్యాపించింది.. దీంతో పక్కనే ఉన్న కంపెనీలో బీహార్ కార్మికులకు 10 మందికి అస్వస్థతకు గురయ్యారు.. దీంతో అస్వస్థతకు గురైన బాధితులను ఆసుపత్రికి తరలించారు అని పోలీసులు వెల్లడించారు.