రష్మిక మందన్న తన డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ గురయ్యారు. ఆ వీడియోలో ఓ మహిళ నల్లటి దుస్తులు ధరించి ఎలివేటర్‌లోకి వెళ్లడం కనిపించింది. అయితే, ఆమె ముఖం రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేయబడింది. వీడియోపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన చెలరేగడంతో ఓ జర్నలిస్టు వాస్తవాన్ని బయటపెట్టారు. అది డీప్ ఫేక్ ఏఐ సాంకేతికతతో తయారు చేసినదని నెటిజన్లను అప్రమత్తం చేశారు. వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ఇది ఫేక్ అని ఎత్తి చూపారు, అయితే అమితాబ్ బచ్చన్ దానికి స్పందిస్తూ.. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఆ మహిళ ముఖాన్ని రష్మికగా మార్చారు. నెటిజన్లు రష్మికకు మద్దతుగా నిలిచారు. వైరల్ వీడియోకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నెటిజన్లతో రష్మికకు మద్దుతుగా నిలిచారు. అంఏతకాకుండా.. ఇది న్యాయపరమైన బలమైన కేసు బాధ్యతులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఈ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు.