NTV Telugu Site icon

Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చనే మొదటి హీరో: అశ్వినీ దత్

Kalki 2898 Ad Amitabh Bachchan

Kalki 2898 Ad Amitabh Bachchan

Producer Ashwini Dutt React on Kalki 2898 AD Budget: ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బడ్జెట్ రూ.600 కోట్లకు పైనే అని ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. కల్కి బడ్జెట్ రూ.700 కోట్లని స్పష్టం చేశారు. ఇంత భారీ బడ్జెట్‌కు తాము ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ఇక ఇప్పటివరకూ కల్కి సినిమా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. విడుదలైన వరం రోజుల్లోనే రూ.700 కోట్లు కొల్లగొట్టి… రూ.1000 దిశగా దూసుకుపోతుంది.

కల్కి 2898 ఏడీ బడ్జెట్‌తో పాటుగా హీరో ప్రభాస్ తనతో చెప్పిన మాటలను కూడా నిర్మాత అశ్వినీ దత్ పంచుకున్నారు. కల్కిలో అమితాబ్ బచ్చన్ గారే మొదటి హీరో అని ప్రభాస్ తనతో అన్నారని అశ్వినీ దత్ తెలిపారు. మనం అమితాబ్ గారిని గౌరవించాలని, అప్పుడే తాము గౌరవించబడతాం అని ప్రభాస్ పేర్కొన్నట్లు చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్‌తో నటించాలనే తన కల నెరవేరిందని కూడా రెబల్ స్టార్ చెప్పారట. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ ఆకట్టుకున్నారు. ఇక బౌంటీ ఫైటర్‌ భైరవగా ప్రభాస్‌ సందడి చేశారు.

Also Read: Top Headlines @ 9AM : టాప్ న్యూస్!

భారీ అంచనాల మధ్య జూన్‌ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా.. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అందరూ కల్కికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వారంలో టిక్కెట్ల రేట్స్ తగ్గనుండడంతో కలెక్షన్స్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరిలో ప్రభాస్‌ కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీపికా పదుకొణె కథానాయిక కాగా.. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు.

 

Show comments