అమితాబ్ కౌన్ బనేగా కరోడ్‌పతి షో బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది.. గత 23 సంవత్సరాలుగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న ఈ రియాల్టీ షో బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే త్వరలోనే ఈ రియాల్టీ షో సీజన్ 15 బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ రియాల్టీ షో ద్వారా మరోసారి బుల్లి తెర ప్రేక్షకులను బిగ్ బీ అమితాబ్ అలరించబోతున్నారు..ఈ సరికొత్త సీజన్ లో కౌన్ బనేగా కరోడ్‌పతి ఎంతో కొత్తగా ఉండబోతుందట. ఈ షో సీజన్ 15 మొదటి ఎపిసోడ్ ఆగస్టు 15న సోనీ టీవీలో ప్రీమియర్ అవుతుంది. స్వాతంత్య దినోత్సవం రోజు ప్రారంభమయ్యే ఈ షో గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ ‘ఈ ఏడాది ప్రసారం కానున్న కౌన్ బనేగా కరోడ్‌పతి లో అన్నీ మారిపోతాయి’ అని చెప్పారు. 2000-2001 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్‌పతి మొదటి సీజన్ స్టార్ ప్లస్‌లో ప్రసారమైంది. ఈ షోతో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా బుల్లి తెరపై అడుగు పెట్టారు. ఈ రియాల్టీ షో ఎంతో ప్రజాదరణ పొందింది. అయితే కౌన్ బనేగా కరోడ్‌పతి షో టీఆర్పి రేటింగ్ లో మాత్రం తన సత్తా చూపలేకపోయింది. దీంతో మొదటి సీజన్ తర్వాత, మేకర్స్ షో 4 సంవత్సరాల బ్రేక్ తీసుకున్నారు.
ఆ తరువాత 2005 ఆగష్టు 5 న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 2 ప్రసారం అయింది. ఈ సీజన్ లో కూడా హోస్ట్ గా అమితాబ్ బచ్చన్ గారు వ్యవహరించారు. అయితే ఈ సీజన్ కూడా టీఆర్పీ రేటింగ్ లో వెనుకబడింది.అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురై కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 2 కి విరామం తీసుకున్నారు. దానితో నిర్మాతలు కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 2 షో ప్రసారాన్ని నిలిపివేశారు. ఆ తరువాత సీజన్ 3లో బిగ్ బి స్థానంలో షారూఖ్ ఖాన్ హోస్ట్ గా చేయడం జరిగింది.అయితే షారుఖ్ ఖాన్ హోస్ట్ గా అమితాబ్ బచ్చన్ మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేయలేకపోయారు. ఆ తరువాత మిగతా సీజన్ లకు మళ్ళీ అమితాబ్ నే తీసుకోవడం జరిగింది.ప్రస్తుతం ప్రసారం కాబోతున్న ఈ రియాల్టీ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.