Amit Shah Tour Schedule minute to minute
మునుగోడు నియోజకవర్గం చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతనిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకుల తమ జెండాను మునుగోడులో ఎగురవేయాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పటికే మనుగోడలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే.. నిన్న సీఎం కేసీఆర్ ప్రజాదీవెన అంటూ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే నేడు.. బీజేపీ మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అయితే.. ఈ భారీ బహిరంగ సభకు జాతీయ నాయకులు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అంతేకాకుండా.. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో.. అమిత్ షా షెడ్యూల్ ను తెలంగాణ బీజేపీ నేతలు విడుదల చేశారు.
Bandi Sanjay : టీఆర్‌ఎస్ పతనం.. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది
రెండు గంటలకు హైదరాబాద్ అమిత్ షా చేరుకోనున్నారు. 2.10 నుంచి 2.30 వరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం. 2.40 నుంచి 3.10 వరకు సికింద్రాబాద్ లోని బీజేపీ కార్యకర్త ఎన్.సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకుంటారు. 3.20 నుంచి 4 గంటల వరకు ప్రైవేట్ హోటల్ లో రైతులు,రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. 4.10 బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు. 4.30 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. 4.35 నుంచి 4.55 వరకు మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం. 5 గంటల నుండి 6 గంటల వరకు మునుగోడు బీజేపీ బహిరంగ సభ. 6.05 నిమిషాలకు మునుగోడు నుంచి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం. 6.50 నుంచి 7.20 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక భేటీ. అనంతరం.. రాత్రి 8 గంటల కు నోవాటేల్ హోటల్‌కు అమిత్ షా చేరుకుంటారు. 8 నుంచి 9 గంటల వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశం. 9.05కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. 9.25 కి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా.
