NTV Telugu Site icon

Amit Shah: అయోధ్య రామమందిరం సనాతన సంస్కృతికి అపూర్వ చిహ్నంగా నిలిచిపోతుంది..

Sha

Sha

సోమవారం అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోట్లాది మంది రామభక్తులకు మరపురాని రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో తరాలు ఎదురుచూశాయని, అయితే రామజన్మభూమిలో మళ్లీ ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని, నమ్మకాన్ని ఏవీ వమ్ము చేయలేదని షా అన్నారు. మరోవైపు.. రామమందిరం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులు అర్పించారని తెలిపారు. వారు ఎన్నో అవమానాలు, చిత్రహింసలు ఎదుర్కొన్నారని అయితే మత మార్గాన్ని వీడలేదని షా అన్నారు.

Read Also: Hyderbad Metro : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కొత్త రూట్ల ఖరారు

విశ్వ హిందూ పరిషత్, వేలాది మంది మహానుభావులు, ఎంతో మంది వ్యక్తుల పోరాటం ఈ రోజు సంతోషకరమైన విజయవంతమైన ఫలితాన్ని ఇచ్చిందని అమిత్ షా తెలిపారు. అయోధ్యలో శ్రీ రామజన్మభూమి దేవాలయం సనాతన సంస్కృతికి అపూర్వ చిహ్నంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రామ మందిరాన్ని నిర్మించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి షా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. అయోధ్యలో ఈరోజు జరిగిన ఈ మహోత్సవానికి అమిత్ షా వెళ్లలేదు. కాగా ఆయన ఢిల్లీలోని బిర్లా టెంపుల్‌లో ఇతర పార్టీ నేతలతో కలిసి ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని షా వీక్షించారు.

Read Also: Karimangar :కాషాయమయమైన కరీంనగర్ తెలంగాణ చౌరస్తా

అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రారంభమైన ప్రాణప్రతిష్ఠ క్రతువు.. ప్రధాని మోడీ బాలరాముడి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదకలు సమర్పించారు. రామ్‌లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. 12: 29: 03 నుంచి 12: 30: 35 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కొనసాగింది. గణేశ్వర శాస్త్రీ ద్రావిడ నేతృత్వంలో మహాగంభీరంగా క్రతువు జరిగింది.